చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ మృతి
చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ కొద్ది సేపటి క్రితం మృతి చెందాడు. ఈయన ఎవరో కాదు చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఈయననే. అప్పట్లో ఆ మ్యాటర్ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి వివాహం 2007లో జరిగింది.
కాగా వీరిద్దరూ 2014లో విడిపోయారు. అప్పటికే వీరికి ఓ కూతురు ఉంది. అయితే శిరీష్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక విడాకులు తీసుకున్న తర్వాత శ్రీజ కల్యాణ్ దేవ్ ను 2016లో వివాహం చేసుకుంది. ఒక పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కూడా విడిపోయారు.
అటు శిరీష్ కూడా కొన్ని రోజులు బీజేపీలో యాక్టివ్ గా కొనసాగాడు. ఆ తర్వాత 2019లో రెండో వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కొన్ని రోజులుగా లంగ్స్ సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.