వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ఆఫీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
రియల్ ఎస్టేట్ రంగంతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
హాజరైన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్
విశ్వంభర న్యూస్ కొత్తూరు :- రియల్ ఎస్టేట్ రంగంతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తూరు మున్సిపాలిటీలోని పెద్దమ్మ తండా రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ఆఫీస్ ను ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి హాజరై ప్రారంభించారు.అనంతరం రియల్ ఎస్టేట్ యజమాన్యం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి,కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువత చదువుకొని నిరుద్యోగులుగా ఉండకుండా స్వయంకృషితో పని చేసుకోవాలని,అప్పుడే తమ తల్లిదండ్రుల మీద ఎలాంటి భారం పడకుండా ఉంటుందన్నారు.నిరుద్యోగ వ్యవస్థను కూడా రూపు మాపొచ్చన్నారు.యువత ఖాళీగా ఉండకుండా వారి నైపుణ్యంతో ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మాదారం కృష్ణ గౌడ్,మాజీ వార్డ్ సభ్యుడు వీరమొని వెంకటేష్ ముదిరాజ్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొర్ర జనార్దన్ రెడ్డి, ఎరుకలి విష్ణుమూర్తి,యువ నాయకుడు శివ చారి,సాగర్,అనిల్,బిజెపి మాజీ మండల అధ్యక్షుడు మల్రెడ్డి మహేందర్ రెడ్డి, నాయకులు బండి రమేష్, శ్రీశైలం గౌడ్,తదితరులు పాల్గొన్నారు.