బీసీ బంద్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్ మద్దతు. -రాపోలు జ్ఞానేశ్వర్
విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42% బీసీలకు రిజర్వేషన్లు (కామారెడ్డి డిక్లరేషన్) హైకోర్టు 50% మించరాదని చెబుతూ 42 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీసీలు అందరూ జేఏసీగా ఏర్పడి బీసీల హక్కులను, 42 శాతం రిజర్వేషన్లుసాధించుకునేందుకు గాను అక్టోబర్ 18, 2025 తెలంగాణ బంద్కు పిలుపు మేరకు కొండా లక్ష్మణ్ బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్ మద్దతు పలుకుతూ బంద్ కార్యక్రమంలో పాల్గొంటుందని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫెడరేషన్ ప్రతినిధులు బంద్ కార్యక్రమంలో పాల్గొంటారని చైర్మన్ రాపోలు జ్ఞానేశ్వర్,పెద్ది జగదీష్ ప్రధాన కార్యదర్శి, Aiobcsa జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్ తెలిపారు.BC హక్కులు, 42% రిజర్వేషన్లు సాధించేందుకుగాను BC యావత్ సమాజం, విద్యార్థులు, ఉద్యోగులు ప్రజా సంఘాలు, కులసంఘాలు అందరూ బందు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు...



