స్పేస్‌‌లో సునీతా విలియమ్స్ డ్యాన్స్.. వీడియో వైరల్

స్పేస్‌‌లో సునీతా విలియమ్స్ డ్యాన్స్.. వీడియో వైరల్

భారత సంతతి అమెరికా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్ర చేపట్టారు.ఐఎస్ఎస్‌లో కాలుపెట్టిన వెంటనే సునీత ఆనందంతో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

భారత సంతతి అమెరికా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్ర చేపట్టారు. బోయింగ్ రూపొందించిన స్టార్‌లైనర్ క్యాప్సుల్ కాలిప్సోలో మరో ఆస్ట్రొనాట్ విల్మోర్‌తో కలిసి బుధవారం బయలుదేరారు. గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకున్నారు. విలియమ్స్, విల్మోర్‌కు ఐఎస్ఎస్‌లోని వ్యోమగాములు స్వాగతం పలికారు.

ఐఎస్ఎస్‌లో కాలుపెట్టిన వెంటనే సునీత ఆనందంతో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా బోయింగ్ కాలిప్సో పేరిట స్టార్‌లైనర్ క్యాప్సుల్‌ను నిర్మించింది. కాలిప్సోతో తొలిసారిగా చేపట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర ఇది. 

Read More భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు..

కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా స్పేస్ ఎక్స్ తో పాటు బోయింగ్‌కు కాంట్రాక్ట్ ఇచ్చింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌తో ఇప్పటికే పలు అంతరిక్ష యాత్రలు నిర్వహించారు. బోయింగ్‌కు చెందిన క్యాప్సుల్ కాలిప్సోతో ప్రయోగం ఇదే తొలిసారి. కాలిప్సోను పునర్వినియోగానికి అనువుగా రూపొందించారు. దీంతో వరుసగా 15 మిషన్ల వరకూ చేపట్టవచ్చు.