ఘనంగా వేణుగోపాల స్వామి  కళ్యాణం 

ఘనంగా వేణుగోపాల స్వామి  కళ్యాణం 

విశ్వంభర, కడ్తాల్: మండల పరిధిలోని మక్తమాదారం గ్రామంలోని  శ్రీ వేణుగోపాలస్వామి  ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి  కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు  గురుక జైపాల్ యాదవ్, ఆమనగల్లు పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహా రెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు,   సర్పంచ్ నరసింహ గౌడ్,  భక్తులు, గ్రామ ప్రజలు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: