ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ
- ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టిన గూడ్స్
- ఐదుగురు మృతి.. 200 మందికి తీవ్ర గాయాలు
- సహాయక చర్యలు ముమ్మరం
- పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఘటన
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఇవాళ(సోమవారం) ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రంగపాణి స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. 200 మందికి తీవ్రగాయాలయ్యాయి.
మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతను చూస్తే గూడ్స్ రైలు బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఎక్స్‌ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ ఏకంగా గాల్లోకి లేచిందంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా కనిపిస్తోంది. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది.
వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఈ విషయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. న్యూ జల్పాయ్‌గుడి నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సిగ్నలింగ్ లోపం కారణంగా ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
West Bengal CM Mamata Banerjee says Kanchenjunga Express train has been hit by a goods train in Darjeeling district; disaster teams rushed to the site for rescue operations
— ANI (@ANI) June 17, 2024
Details awaited. pic.twitter.com/vU5fN44qH6
ఘోర రైలు ప్రమాదం.. ఢీకొట్టుకున్న రెండు రైళ్లు
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2024
పశ్చిమ బెంగాల్ - డార్జిలింగ్ జిల్లాలోని న్యూజల్పాయిగురిలో రెండు రైళ్లు ఢీకొన్నాయి.
గూడ్స్ రైలును ఢీకొట్టిన కాంచనజంగ ఎక్స్ ప్రెస్ రైలు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది pic.twitter.com/piU3Tu8kKe