‘అలా ఉంటే అత్యాచారయత్నం కాదు..’ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

‘అలా ఉంటే అత్యాచారయత్నం కాదు..’ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

  • 33ఏళ్ల కిందట అత్యాచారయత్నం కేసు నమోదు
  • రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా పరిధిలో ఘటన 

రాజస్తాన్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలిక లోదుస్తులు తొలిగించి.. బాలిక ఎదురుగా అబ్బాయి నగ్నంగా ఉండటం అనేది అత్యాచార యత్నం కాదని తెలిపింది. అత్యాచార యత్నం కేసులో 33ఏళ్లకు తీర్పు చెప్పింది కోర్టు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 1991లో రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా పరిధిలో ఆరేళ్ల బాలిక రాత్రి 8గంటలకు నీళ్లు తాగడానికి వెళ్లగా సువాలాల్ అనే వ్యక్తి పక్కనే ఉన్న ధర్మశాలకు తీసుకెళ్లి ఆ బాలిక లోదుస్తులు తొలిగించాడు. 

సువాలాల్ కూడా దుస్తులు విప్పేసి నగ్నంగా మారాడు. ఆ సమయంలో బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితున్ని పోలీసులకు పట్టించారు. ఈ కేసుపై 33 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడగా రాజస్థాన్ హైకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది. ‘బాలిక లోదుస్తులు తొలిగించి.. అబ్బాయి తన దుస్తులు తొలగించుకొని నగ్నంగా ఉండటం అత్యాచార యత్నం కాదు’ అని తెలిపింది.

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

Related Posts