వాట్సాప్‌ గ్రూపు నుంచి తొలగించారని.. ఇద్దరు యువకుల దారుణ హత్య

వాట్సాప్‌ గ్రూపు నుంచి తొలగించారని.. ఇద్దరు యువకుల దారుణ హత్య

వాట్సాప్‌ గ్రూప్‌లో పుట్టినరోజు వేడుకల ఫొటోలతో పాటు గ్రూప్‌ నుంచి తనను తొలగించడంతో కోపంతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తన స్నేహితుడితో కలిసి ఇద్దరు యువకులను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు.

వాట్సాప్‌ గ్రూప్‌లో పుట్టినరోజు వేడుకల ఫొటోలతో పాటు గ్రూప్‌ నుంచి తనను తొలగించడంతో కోపంతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తన స్నేహితుడితో కలిసి ఇద్దరు యువకులను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఫార్చ్యూన్ బట్టర్‌ప్లై సిటీలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కడ్తాల్‌ మండల కేంద్రం సమీపంలోని ఫార్చ్యూన్‌ బట్టర్‌ఫ్లై సిటీలోని ఓ విల్లాను గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు జల్కం రవి ఇటీవల అద్దెకు తీసుకొన్నాడు.

రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు అందులో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నెల 4న సాయంత్రం రవి తన పుట్టినరోజు వేడుకలను పలువురు బీజేపీ నాయకులు, స్నేహితులతో కలిసి జరుపుకున్నాడు. అయితే, బర్త్ డే ఫొటోలను గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేశాడు. పెద్దఎత్తున ఫొటోలను పోస్టు చేయడంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గ్రూప్ అడ్మిన్ శేషిగారి శివగౌడ్(24), గుండెమొని శివగౌడ్(29) ఆ ఫొటోలను డిలీట్ చేశారు. అదేవిధంగా బల్కం రవిని గ్రూపులో నుంచి రిమూవ్ చేశారు. 

Read More మైనారిటీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల సందర్శించిన టీపీసీసీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు 

ఇది మనసులో పెట్టుకున్న బల్కం రవి బీజేవైఎం నేత పల్లె రాజుగౌడ్‌తో కలిసి ఆ యువకులను తన వెంచర్‌లోని ఆఫీసుకు పిలిచాడు. అక్కడ నలుగురు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఫొటోలను ఎందుకు డిలీట్ చేశారని, గ్రూపు నుంచి ఎందుకు తొలింగించారని రవి, రాజు వారితో గొడవ పడ్డారు. వారి మధ్య మాటామాటా పెరిగిన క్రమంలో రవి, రాజు గౌడ్‌ కత్తులతో దాడి చేసి గుండమోని శివగౌడ్‌, శేషగారి శివగౌడ్‌లను హత్య చేశారు. ఆ తర్వాత విల్లాకు తాళం వేసి వెళ్లిపోయిన రవి, రాజుగౌడ్‌లు గురువారం ఉదయం పోలీసులకు, స్థానికులకు జంటహత్యల గురించి సమాచారం ఇచ్చి లొంగిపోయారు. హతుల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు కడ్తాల్‌లో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కడ్తాల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని వారితో, పోలీసులతో మాట్లాడారు. హత్యలకు గల కారణాలు తెలుసుకున్నారు.