ప్రేయసి పెళ్లికి వెళ్లిన మాజీ ప్రేమికుడు.. పెళ్లికొడుకుపై కత్తితో దాడి..!

ప్రేయసి పెళ్లికి వెళ్లిన మాజీ ప్రేమికుడు.. పెళ్లికొడుకుపై కత్తితో దాడి..!

ప్రేయసి పెళ్లికి వెళ్లి మాజీ ప్రియుడు ఏకంగా పెళ్లికొడుకుపై కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ భిల్వారాలో జరిగింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వేదికపై కూర్చొని బంధు మిత్రులతో ఫొటోలు దిగుతున్నారు. 

ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో దాడులు పెరుగుతున్నాయి. ప్రేమిస్తున్నానని వెంట పడటం కాదంటే ప్రాణాలను తీస్తుండటం కలకలం రేపుతోంది. తాజాగా ప్రేయసి పెళ్లికి వెళ్లి మాజీ ప్రియుడు ఏకంగా పెళ్లికొడుకుపై కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ భిల్వారాలో జరిగింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వేదికపై కూర్చొని బంధు మిత్రులతో ఫొటోలు దిగుతున్నారు. 

ఈ క్రమంలో ఆ వేడుకకు వచ్చిన పెళ్లికూతురు మాజీ ప్రియుడు ఫొటో దిగడానికి స్టేజిపైకి ఎక్కాడు. వెంట తెచ్చుకున్న కత్తితో పెళ్లి కొడుకుపై పలుసార్లు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో పెళ్లికొడుక్కి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More నగల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా గ్రూప్