ప్రముఖ నటి ఇంట్లో భారీ చోరీ
ప్రముఖ నటి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 110గ్రాముల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రముఖ మరాఠీ నటి శ్వేత షిండే ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.
ప్రముఖ నటి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 110గ్రాముల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రముఖ మరాఠీ నటి శ్వేత షిండే ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 110 గ్రాములు ఆభరణాలతో పాటు నగదును కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. శ్వేత షిండే ప్రస్తుతం మహారాష్ట్రలోని సతారాలో తల్లితో కలిసి ఈమె నివాసముంటోంది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలుపడ్డారు. ఆ సమయంలో శ్వేత ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది.
శ్వేత షిండే ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. నిర్మాతగానూ పలు సీరియల్స్ తీస్తోంది. మహారాష్ట్రలోని సతారాలో తన తల్లితో కలిసి నివాసముంటోంది. అయితే జూన్ 3వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు 110గ్రాముల బంగారాన్ని, నగదును అపహరించుకెళ్లారు. అయితే, డబ్బు ఎంత పోయిందనేది తెలియాల్సి వుంది. ఈ విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. శ్వేత 2007లో సందీప్ భన్సాలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కూతురు ఉంది. 2016లో నిర్మాతగా మారింది.