కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కలకలం
ముంబైలో ఓ వైద్యుడికి ఊహించని సంఘటన ఎదురైంది. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే అందులో మనిషి వేలు ప్రత్యక్షమైంది. అది చూసి ఆ డాక్టర్ గుండె గుబేలుమంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐస్‌క్రీమ్ అంటే కొంతమంది అమితంగా ఇష్టపడుతుంటారు. ఆన్‌లైన్ డెలివరీ సదుపాయం పెరగడంతో ఏది కావాలన్నా నిమిషాల్లో డెలివరీ అవుతున్నాయి. దీంతో ఇష్టమైన ఫుడ్‌తో పాటు ఐస్‌క్రీమ్స్ ఆర్డర్ పెడుతున్నారు. అయితే అలా ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టిన ఓ వైద్యుడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే అందులో మనిషి వేలు ప్రత్యక్షమైంది. అది చూసి ఆ డాక్టర్ గుండె గుబేలుమంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని మలాడ్‌లో నివాసముంటున్న ఓ యువ వైద్యుడు ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావోకి ఐస్‌క్రీమ్ తినాలనిపించింది.
దీంతో వెంటనే ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాడు. యుమ్మో ఐస్ క్రీమ్స్ షాప్‌నుంచి మూడు యుమ్మో ఫ్లేవర్డ్ బటర్‌స్కోచ్కోన్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ పెట్టాడు. నిమిషాల్లో ఐస్ క్రీమ్స్ కూడా ఇంటికి డెలివరీ అయ్యాయి. ఎంతో ఆశతో దాన్ని తీసుకుని తినడం మొదలు పెట్టాడు ఆ డాక్టర్. ఇంతలో నాలుకకు ఏదో గట్టి పదార్థం తగులుతున్నట్లు అనిపించింది. అనుమానం వచ్చి ఐస్‌క్రీమ్‌ను పరిశీలించగా రెండు అంగులాల మనిషి వేలు కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే మలాడ్‌లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వైద్యుడి పిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.