రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది: సీఎం రేవంత్‌రెడ్డి

రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది: సీఎం రేవంత్‌రెడ్డి

తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తూ..తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి రామోజీరావు విలువలు జోడించారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు.

అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ రామోజీరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పలు రంగాల్లో వ్యాపార వేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబసభ్యులకు కేసీఆర్ బీఆర్ఎస్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపినట్లు బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.