పోచంపల్లి కో - ఆపరేటివ్ బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తా : చైర్మన్ తడక రమేష్
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సమగ్ర అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన చైర్మన్ తడక రమేష్ అన్నారు.
భూదాన్ పోచంపల్లి, విశ్వంభర:
బ్యాంకు బాధ్యతలు స్వీకరణ - పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సమగ్ర అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన చైర్మన్ తడక రమేష్ అన్నారు. పోచంపల్లి అర్బన్ బ్యాంకుకు జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తడక రమేష్ ప్యానల్ అభ్యర్థులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయగా , చైర్మన్ తడక రమేష్ సోమవారం ఉదయం 11 గంటలకు పదవి బాధ్యతలు స్వీకరించారు .
అదేవిధంగా వైస్ చైర్మన్ గా భారత రాజేంద్రప్రసాద్ (రాజు) ఎన్నికయ్యారు. అనంతరం వారి కమిటీ డైరెక్టర్లు ఏలే హరిశంకర్, రాపోలు వేణు, కర్నాటి భార్గవి, కొండమడుగు ఎల్ల స్వామి, లు కార్యక్రమంలో పాల్గొన్నారు . తడాఖా రమేష్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు. పోచంపల్లి పేరు ఇక్కత్ వస్త్ర ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందగా, పోచంపల్లి అర్బన్ బ్యాంక్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపును సాధించిందని అన్నారు. సుమారు పది బ్రాంచ్ లతో లక్ష మంది ఖాతాదారులతో బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో మందికి రుణాలు అందజేయడంతో పాటు పేద ప్రజల ఆర్థిక పరిస్థితి బాగు చేస్తుందన్నారు. అదేవిధంగా పేద ప్రజలకు అండగా నిలవడంతో పాటు , ఖాతాదారుల శ్రేయస్సే లక్ష్యంగా పాలకవర్గం ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు సిఈఓ సీత శ్రీనివాస్ నూతనంగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తడక రమేష్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు . రమేష్ ఎన్నిక పట్ల పలు రాజకీయ పార్టీలు , వివిధ సామాజిక వర్గాలు ,TR యువసేన , అభిమానులు , మిత్రులు , సన్నిహితులు ,కుటుంభం సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. అనంతరం ఆయన పాలకవర్గ సభ్యులతో కలిసి ఆందోల్ మైసమ్మ దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.