Technology - Vishvambhara News

జియోలో అదిరిపోయే వీఐపీ నంబర్ ఆఫర్.. రూ.15 వేలకే నంబర్‌తో పాటు అదనపు ప్రయోజనాలు
Jio VIP Number: జియో వినియోగదారులకు ప్రత్యేక వీఐపీ నంబర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు తమకు నచ్చిన ప్రత్యేక నంబర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 9xxxx900900, 9xxxx009999 వంటి ఆకర్షణీయమైన నంబర్లను వీఐపీ నంబర్లుగా ఎంపిక చేసుకోవచ్చని జియో పేర్కొంది.

ఈ ఆఫర్‌లో భాగంగా వీఐపీ నంబర్‌తో పాటు ఏడాది పాటు అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ విలువ రూ.4,000కు పైగా ఉంటుందని జియో పేర్కొంది. దీంతో ప్రత్యేక నంబర్ కోరుకునే వినియోగదారులకు ఈ ఆఫర్ ఆసక్తికరంగా మారింది.

అంతేకాకుండా 5000GB గూగుల్ స్టోరేజ్, జెమినీ ప్రో ప్లాన్, జియోహాట్‌స్టార్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్లు జియో తెలిపింది. వీటన్నింటినీ కలిపి రూ.15,000 ధరకు అందిస్తున్నట్లు ఆఫర్‌లో పేర్కొంది. ఈ ధరలో జీఎస్టీ కూడా కలిపి ఉంటుందని వివరించింది.

ఈ వీఐపీ నంబర్ ఆఫర్ జియో వినియోగదారులతో పాటు ఇతర నెట్‌వర్క్‌ల వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ప్రత్యేక నంబర్‌ను ఎంచుకుని ఈ ఆఫర్‌ను పొందేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ ఆఫర్ సెప్టెంబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో సందేశంలో పేర్కొంది.

అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఘటన.. సెలవు కోసం తోటి విద్యార్థిని చంపేందుకు ప్రయత్నం
: అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు సెలవు వస్తుందనే ఉద్దేశంతో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

రూమ్‌మేట్ చనిపోతే పాఠశాలకు సెలవు ఇస్తారని భావించిన ఇద్దరు విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. రాత్రి సమయంలో బాధిత విద్యార్థి ముఖంపై దిండుతో నొక్కి, అనంతరం గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తోటి విద్యార్థుల నుంచి తప్పించుకున్న బాధిత బాలుడు వెంటనే పాఠశాల సిబ్బందిని ఆశ్రయించి జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో సిబ్బంది అప్రమత్తమై బాలుడి పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై పాఠశాల అధికారులు వివరాలు సేకరించారు.

మైనర్ విద్యార్థులు సెలవు కోసం తోటి విద్యార్థి ప్రాణాలకే ముప్పు తెచ్చే స్థాయికి వెళ్లడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మధ్య ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రియల్‌మీ P4s 5G సేల్ ప్రారంభం.. ధర, ఫీచర్లు ఇవే
Realme P4s 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ P4s 5G విక్రయాలను ప్రారంభించింది. డ్యూయల్ చిప్ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫోన్ వేగవంతమైన పనితీరు, స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా 5G కనెక్టివిటీతో పాటు రోజువారీ వినియోగం, మల్టీటాస్కింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.

రియల్‌మీ P4s 5Gలో 8GB వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. వినియోగదారులు 12 నెలల నో కాస్ట్ EMI సదుపాయాన్ని ఉపయోగించుకుంటే నెలకు రూ.2,667 చొప్పున చెల్లించే అవకాశం ఉంది. ఫోన్ డిజైన్, కెమెరా సెటప్, బ్యాటరీ సామర్థ్యం, పనితీరుకు సంబంధించిన ఫీచర్లను కూడా కంపెనీ ప్రచారంలో ప్రత్యేకంగా హైలైట్ చేసింది.

ప్రస్తుతం రియల్‌మీ P4s 5G సేల్ ప్రారంభమైనట్లు కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.3,000 వరకు ప్రయోజనం లభించే అవకాశం ఉన్నట్లు ప్రచార చిత్రంలో పేర్కొంది. అయితే ఆఫర్‌కు సంబంధించిన పూర్తి నిబంధనలు, అందుబాటులో ఉన్న వేరియంట్లు, బ్యాంక్ లేదా ప్లాట్‌ఫామ్ ఆధారిత ప్రయోజనాలను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు తప్పనిసరిగా పరిశీలించాలి.

ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
POVA AI BUDS PRO: టెక్నాలజీ దిగ్గజం POVA మార్కెట్లోకి వినూత్నమైన డిజైన్ మరియు అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరికొత్త POVA AI BUDS PRO ఇయర్‌బడ్స్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. సాధారణ ఇయర్‌బడ్స్‌కు పూర్తి భిన్నంగా రూపొందిన ఈ డివైస్, స్మార్ట్ ఫీచర్లతో యూజర్లకు రోజువారీ పనులను ఎంతో సులభతరం చేసేందుకు సిద్ధమైంది.

అబ్బురపరిచే స్మార్ట్ AI ఫీచర్లు

ఈ ఇయర్‌బడ్స్ కేవలం పాటలు వినడానికే కాకుండా, ఆఫీస్ మీటింగ్‌లు మరియు ఫోన్ కాల్స్‌కు సంబంధించిన పూర్తి సంభాషణను క్షణాల్లో సారాంశంగా మార్చి ఇస్తాయి. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలను వెంటనే నోట్స్ రూపంలో రాసి అందించడం, మాట్లాడే మాటలను టెక్స్ట్‌గా మార్చే ట్రాన్స్‌క్రిప్ట్ సదుపాయం వీటిలో ఉంది. వీటితో పాటు ఏకంగా 78 భాషల్లో లైవ్ అనువాదం చేసుకునే అద్భుతమైన సదుపాయం ఉండటం దీని ప్రత్యేకత.

అదిరిపోయే సౌండ్ - మైక్ క్వాలిటీ

ఆడియో ప్రియుల కోసం ఇందులో Hi-Res ఆడియో మరియు LHDC సపోర్ట్‌ను అందించారు, ఇది అత్యుత్తమ శబ్ద నాణ్యతను అందిస్తుంది. ఇక కాల్స్ మాట్లాడేటప్పుడు ఎలాంటి నాయిస్ లేకుండా స్పష్టమైన వాయిస్ వినిపించేందుకు, అలాగే క్లీన్ రికార్డింగ్స్ కోసం ఒక్కో జతలో ఏకంగా 8 శక్తివంతమైన మైక్రోఫోన్లను అమర్చారు.

ఆకట్టుకునే ధర - లాంచ్ ఆఫర్లు

ఈ POVA AI BUDS PRO అసలు ధర రూ.14,999 కాగా, లాంచ్ సేల్ ఆఫర్‌లో భాగంగా రూ.12,499 ప్రత్యేక ధరకే ఫ్లిప్ కార్ట్‌ లో అందుబాటులోకి రానుంది. ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్ల ద్వారా అదనంగా మరో రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే వినియోగదారుల సౌకర్యార్థం 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ సరికొత్త ఇయర్‌బడ్స్ సేల్ ఆగస్టు 22 నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది.

POCO M8x 5G వచ్చేస్తోంది.. ఆగస్టు 21న గ్రాండ్ లాంచ్
POCO M8x 5G phone: స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకునేలా POCO M8x 5G త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. POCO సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 21న మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఇందుకు సంబంధించిన టీజర్లను విడుదల చేశారు. పనితీరు, గేమింగ్, కూలింగ్‌ వంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్‌ చేస్తూ ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

POCO M8x 5Gలో భారత్‌లో తొలిసారిగా Snapdragon 4 Gen 5 ప్రాసెసర్‌ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ చిప్‌సెట్‌ తదుపరి తరం AI సామర్థ్యాలు, వేగవంతమైన రెస్పాన్స్‌, స్మూత్‌ గేమింగ్‌ అనుభూతిని అందిస్తుందని తెలిపింది. 4nm ప్రాసెస్‌ టెక్నాలజీతో రూపొందిన ఈ ప్రాసెసర్‌ యాప్‌లను వేగంగా ఓపెన్‌ చేసేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఫోన్ 650K+ AnTuTu స్కోర్‌ సాధిస్తుందని టీజర్‌లో పేర్కొంది.

మెమరీ విషయానికి వస్తే 12GB వరకు RAM అందుబాటులో ఉండనుంది. ఇందులో 6GB వర్చువల్‌ RAM కూడా ఉంటుంది. LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్‌ టెక్నాలజీతో భారీ యాప్‌లను కూడా వేగంగా రన్‌ చేయడం, మల్టీటాస్కింగ్‌లో మెరుగైన పనితీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ఫోన్‌లో ట్రిపుల్ కూలింగ్ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 12,439 చదరపు మిల్లీమీటర్ల అల్ట్రా-లార్జ్ గ్రాఫైట్ కూలింగ్, 1,924 చదరపు మిల్లీమీటర్ల కాపర్ ఫాయిల్ లేయర్‌, 3.5W హై-ఎఫిషియెన్సీ థర్మల్ జెల్‌ను ఇందులో ఉపయోగించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇవి ఫోన్‌లో ఉత్పత్తి అయ్యే వేడిని సమర్థంగా బయటకు పంపించడంలో సహాయపడతాయని తెలిపింది.

అంతేకాకుండా 48 నెలల వరకు ల్యాగ్‌-ఫ్రీ వినియోగం కోసం ఫోన్‌ను ఆప్టిమైజ్ చేసినట్లు POCO పేర్కొంది. రిపేర్‌ సేవలు, సర్వీస్‌ సెంటర్లకు సంబంధించిన వివరాలను కూడా టీజర్లలో వెల్లడించింది. 92 శాతానికి పైగా రిపేర్‌లు అదే రోజులో పూర్తవుతాయని, దేశవ్యాప్తంగా 700కు పైగా సర్వీస్‌ సెంటర్లు, 600కు పైగా నగరాల్లో సేవలు, 19,000కు పైగా సర్వీస్‌ పిన్‌కోడ్‌లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు.. 80 శాతం వరకు డిస్కౌంట్
Amazon Offers: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ‘Best Selling Deals Extended’ పేరుతో కొనసాగుతున్న ప్రత్యేక సేల్‌లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించినట్లు అమెజాన్ తన యాప్‌లో వెల్లడించింది. ఇందులో భాగంగా కిచెన్, ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాలకు చెందిన ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు కనిపిస్తోంది.

అదేవిధంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. AU Small Finance Bank, Axis Bank, ICICI Bank, IndusInd Bank కార్డులతో కొనుగోళ్లు చేసే వినియోగదారులకు ఈ ప్రత్యేక డిస్కౌంట్ వర్తిస్తుందని అమెజాన్ పేర్కొంది. అయితే ఆఫర్లకు సంబంధించి ఆయా నిబంధనలు, షరతులు వర్తిస్తాయని తెలిపింది.

ప్రస్తుతం అమెజాన్‌లో కొనసాగుతున్న ఈ డీల్స్‌లో Ninja వంటి ఉత్పత్తులపై భారీ తగ్గింపులు కనిపిస్తున్నాయి. దీంతో అవసరమైన వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సేల్‌ ఉపయోగకరంగా మారనుంది. అయితే ప్రతి ఉత్పత్తికి డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్, అర్హత నిబంధనలు వేర్వేరుగా ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసే ముందు పూర్తి వివరాలను పరిశీలించాలని సూచిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లో మైక్రోసైట్ లీక్... ఆగస్టు 14న లాంచ్ కానున్న మోటోరోలా మైండ్ బ్లోయింగ్ ఫోన్
Motorola Smartphone: మోటోరోలా కంపెనీ తన జీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. Moto G Max పేరుతో రూపొందుతున్న ఈ ఫోన్‌ను ఆగస్టు 14న భారత్‌లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌లో ఏర్పాటు చేసిన మైక్రోసైట్ ద్వారా తెలుస్తోంది. భారీ బ్యాటరీ, ఆకట్టుకునే కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది.

డిస్‌ప్లే – ఫీచర్లు

Moto G Maxలో 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను అందించనున్నట్లు సమాచారం. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనుంది. దీంతో గేమింగ్, వీడియోలు చూడటం, సోషల్ మీడియా యాప్స్‌లో స్క్రోలింగ్ వంటి పనులు మరింత స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది. బయట ఎక్కువ వెలుతురు ఉన్న సమయంలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా అధిక బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉండనుంది. డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ సిరామిక్ ప్రొటెక్షన్ అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే దుమ్ము, నీటి చుక్కల నుంచి ఫోన్‌కు రక్షణ కల్పించేలా IP64 రేటింగ్ ఉండే అవకాశం ఉంది.

ప్రాసెసర్ – పనితీరు

పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 6s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. మల్టీటాస్కింగ్, యాప్స్ వినియోగం, సాధారణ గేమింగ్ వంటి పనులు వేగంగా నిర్వహించేలా ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. దీనికి 6GB LPDDR5X RAM, 128GB వరకు UFS 3.1 స్టోరేజ్ అందించే అవకాశం ఉంది. ఒకేసారి పలు యాప్స్‌ను ఉపయోగించే సమయంలో కూడా మెరుగైన పనితీరు అందించేలా హార్డ్‌వేర్‌ను రూపొందించినట్లు సమాచారం.

డ్యూయల్ కెమెరా సెటప్

ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50MP Sony LYTIA 600 ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కెమెరాకు OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉండనుంది. దీంతో ఫొటోలు, వీడియోలు తీసే సమయంలో చేతి కదలికల ప్రభావం కొంత తగ్గి స్పష్టమైన చిత్రాలను పొందే అవకాశం ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 32MP ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్లు సమాచారం.

7,000mAh భారీ బ్యాటరీ

Moto G Maxలో ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచే 7,000mAh భారీ బ్యాటరీను అందించనున్నారు. ఎక్కువ సమయం ఫోన్‌ను ఉపయోగించే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని పెద్ద సామర్థ్యం కలిగిన బ్యాటరీని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా వినియోగం వంటి పనులకు ఎక్కువ బ్యాకప్ అందించే అవకాశం ఉంది. బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసేందుకు 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది.

ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్

సాఫ్ట్‌వేర్ పరంగా Moto G Max Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనున్నట్లు సమాచారం. మోటోరోలా అందించే Hello UIతో ఫోన్ వస్తుందని తెలుస్తోంది. వినియోగదారులకు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ అందించేందుకు రెండు ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందించే అవకాశం ఉంది.

లాంచ్ తేదీ -ధర

ఫ్లిప్‌కార్ట్‌లో ఏర్పాటు చేసిన మైక్రోసైట్ ప్రకారం Moto G Maxను ఆగస్టు 14, 2026న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. లాంచ్ సమయంలో ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, వేరియంట్లు, అధికారిక ధర, లభించే ఆఫర్లను మోటోరోలా వెల్లడించే అవకాశం ఉంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం Moto G Max ధర రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ప్రస్తుతం అంచనా ధర మాత్రమే. కంపెనీ అధికారిక ధరను ఆగస్టు 14న లాంచ్ సందర్భంగా వెల్లడించనుంది. బ్యాంక్ ఆఫర్లు, కార్డు డిస్కౌంట్లు, ఇతర లాంచ్ ఆఫర్లను బట్టి ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉండవచ్చు. లాంచ్ అనంతరం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటోరోలా అధికారిక విక్రయ వేదికల ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అమెజాన్ మాస్ ధమాకా: ఆగస్టు 7 నుంచి గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. దిమ్మతిరిగే ఊహించని ఆఫ‌ర్లు
Amazon Great Freedom Sale: అమెజాన్‌లోఆగస్టు 7 నుంచి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కానుంది. స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సేల్లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులు, స్మార్ట్‌వాచ్‌లు, పర్సనల్ కేర్ ఉత్పత్తులు, డైలీ నీడ్స్ వస్తువులతో పాటు వేలాది ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందించనున్నారు. ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభించనుంది.

స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై బంపర్ ఆఫర్లు

ఈ సేల్‌లో ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్లు, ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి. శామ్‌సంగ్, వన్‌ప్లస్, వివో, ఐక్యూ, రియల్‌మీ, రెడ్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై వేల రూపాయల వరకు ధర తగ్గనుంది.

హోమ్ అప్లయెన్సెస్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్

రోబోట్ వాక్యూమ్ క్లీనర్లు, కిచెన్ ఉత్పత్తులు, కుక్‌వేర్, స్టోరేజ్ వస్తువులు, హోమ్ డెకర్, ఇతర గృహోపకరణాలపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఇంటి అవసరాలకు సంబంధించిన అనేక ఉత్పత్తులను తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం లభించనుంది.

పర్సనల్ కేర్ ఉత్పత్తులపై 60 శాతం వరకు తగ్గింపు

హెయిర్ కేర్, స్కిన్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు ప్రత్యేక ధరల్లో అందుబాటులోకి రానున్నాయి.

ఫ్యాషన్ ఉత్పత్తులపై అదిరిపోయే ధరలు

పురుషులు, మహిళలు, పిల్లల దుస్తులు, చెప్పులు, బ్యాగులు, ఫ్యాషన్ యాక్సెసరీస్‌పై భారీ ఆఫర్లు ప్రకటించారు. ఎంపిక చేసిన దుస్తులు రూ.399 లోపు, మరికొన్ని ఉత్పత్తులు రూ.249 ప్రారంభ ధర నుంచి లభించనున్నాయి.

స్మార్ట్‌వాచ్‌లు, మొబైల్ యాక్సెసరీస్‌పై ప్రత్యేక ఆఫర్లు

స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, ఛార్జర్లు, ఇతర మొబైల్ యాక్సెసరీస్ రూ.99, రూ.1,099 ప్రారంభ ధరలతో అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. అంతేకాకుండా.. వాషింగ్ పౌడర్లు, వంట నూనెలు, డైపర్లు, కిచెన్ ఉత్పత్తులు, ఇతర డైలీ నీడ్స్ వస్తువులపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. కుటుంబ అవసరాల కొనుగోళ్లకు ఈ సేల్ మంచి అవకాశంగా మారనుంది.

బ్యాంకు ఆఫర్లతో మరింత ఆదా

ఎంపిక చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అలాగే కొన్ని ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ, అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

రూ.10 వేలకే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా!.. మార్కెట్లోకి బోల్ట్ ఇవో' ఎంట్రీ
Flipkart Offers: భారత మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఫైర్-బోల్ట్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగుపెడుతోంది. స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌తో గుర్తింపు సంపాదించిన  బోల్ట్ అనే కొత్త బ్రాండ్‌తో కంపెనీ తన తొలి స్మార్ట్‌ఫోన్ బోల్ట్ ఇవోను ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ వేదికగా విక్రయానికి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లతో ఈ ఫోన్‌పై టెక్నాలజీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ప్రీమియం డిజైన్‌తో ఆకట్టుకోనున్న ఫోన్

బోల్ట్ ఇవో రూపకల్పనను చూస్తే ఇది బడ్జెట్ ఫోన్ కంటే ప్రీమియం ఫోన్‌లా కనిపిస్తుంది. సన్నని బాడీ, ఫ్లాట్ ఫ్రేమ్, మృదువైన ఫినిషింగ్, వెనుక భాగంలో ఆకర్షణీయమైన ద్వంద్వ కెమెరా అమరికతో ఈ ఫోన్‌ను రూపొందించారు. యువతను ఆకర్షించేలా ఆధునిక రూపకల్పనకు కంపెనీ ప్రాధాన్యం ఇచ్చింది. చేతిలో పట్టుకున్నప్పుడు తేలికగా ఉండేలా, ఉపయోగించడానికి సౌకర్యంగా ఉండేలా తయారు చేసినట్లు తెలుస్తోంది.

శక్తివంతమైన పనితీరు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూనిసాక్ టి7250 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండనున్నట్లు సమాచారం. రోజువారీ వినియోగం, సామాజిక మాధ్యమాల వినియోగం, వీడియోలు వీక్షించడం, ఆన్‌లైన్ తరగతులు, తేలికపాటి గేమింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించే సామర్థ్యం ఇందులో ఉండనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత నిల్వతో పాటు అవసరమైతే మెమరీని విస్తరించుకునే అవకాశం కూడా ఉండొచ్చని సమాచారం.

కెమెరా విభాగంలో ప్రత్యేకత

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సహాయక కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ముందు కెమెరాను అందించే అవకాశం ఉంది. కృత్రిమ మేధస్సు ఆధారిత చిత్రీకరణ, రాత్రి సమయంలో మెరుగైన ఫోటోలు, అందాన్ని మెరుగుపరిచే ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

భారీ బ్యాటరీ

బోల్ట్ ఇవోలో 6,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీను అందించనున్నట్లు సమాచారం. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో రోజంతా లేదా అంతకంటే ఎక్కువసేపు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే 18 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్ అనుభవం

ఈ ఫోన్‌లో తాజా ఆండ్రాయిడ్ 16 ఆధారిత నిర్వహణ వ్యవస్థను అందించే అవకాశం ఉంది. అవసరం లేని యాప్‌లు తక్కువగా ఉండటం, వేగవంతమైన పనితీరు, సులభమైన వినియోగ అనుభవం ఈ ఫోన్ ప్రత్యేకతగా నిలవొచ్చని భావిస్తున్నారు. క్రమం తప్పకుండా భద్రతా నవీకరణలు కూడా అందించే అవకాశం ఉంది.

ధర ఎంత ఉండొచ్చు?

బోల్ట్ ఇవోను బడ్జెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకొస్తున్నందున దీని ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ ఫోన్ అదే ధరలో ఉన్న ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీ ఇవ్వొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి ధర, విక్రయ తేదీ, అన్ని ఫీచర్లను కంపెనీ ఆవిష్కరణ కార్యక్రమంలో అధికారికంగా వెల్లడించనుంది.

నేడే మధ్యాహ్నం 12 గంటలకే అసలైన సంచలనం.. బ్రాండ్లకి చమటలు పట్టిస్తున్న Vivo S2
Vevo S2 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన కొత్త వివో ఎస్2 స్మార్ట్‌ఫోన్‌ను నేడు మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా ఆవిష్కరించనుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్లో టీజర్ విడుదల కావడంతో ఈ ఫోన్‌పై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది. సన్నని బాడీ, ఆకర్షణీయమైన కెమెరా డిజైన్‌తో ఈ ఫోన్ ప్రీమియం లుక్‌లో రానుంది.

డైమెన్సిటీ 7360 ప్రాసెసర్

లీక్‌ల ప్రకారం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ, 256 జీబీ నిల్వ సామర్థ్యాల ఎంపికలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను సులభంగా నిర్వహించేలా ఈ ఫోన్ పనితీరు ఉండనుంది.

కెమెరా ప్రత్యేకతలు

ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ సహాయక కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ముందు కెమెరాను అందించే అవకాశముందని సమాచారం. కృత్రిమ మేధస్సు ఆధారిత కెమెరా ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.

భారీ బ్యాటరీ

ఈ ఫోన్‌లో 7,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, 80 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం ఉండే అవకాశం ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు వినియోగించుకునేలా బ్యాటరీ సామర్థ్యాన్ని కంపెనీ అందించనుంది.

ధర ఎంత ఉండొచ్చు?

వివో ఎస్2 ప్రారంభ ధర రూ.38 వేల నుంచి రూ.43 వేల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. అధికారిక ధర, పూర్తి ఫీచర్లను నేడు మధ్యాహ్నం జరిగే ఆవిష్కరణ కార్యక్రమంలో కంపెనీ వెల్లడించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుంది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌కు కౌంట్‌డౌన్.. ఆగస్టు 7 నుంచి భారీ ఆఫర్లు
Amazon Great Freedom Sale: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన వార్షిక గ్రేట్ ఫ్రీడమ్ సేల్ను ఆగస్టు 7 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు వేలాది ఉత్పత్తులపై భారీ ధర తగ్గింపులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు ఉత్పత్తులపై డీల్స్‌ను అమెజాన్ వెల్లడించింది.

ఈ సేల్‌లో ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించనున్నారు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 15 శాతం వరకు అదనపు ఆదా చేసే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈజీ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు అందించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. దీంతో వినియోగదారులు మరింత తక్కువ ధరకే ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

అదనంగా అమెజాన్ పే యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వారికి రూ.150 వరకు నగదు తిరిగి, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు 5 శాతం వరకు నగదు తిరిగి లభించనుంది. అలాగే వడ్డీ లేని మూడు నెలల వాయిదా సౌకర్యం కూడా కొన్ని ఉత్పత్తులపై అందుబాటులో ఉంటుంది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక విక్రయాల్లో కొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్లు, నగదు తిరిగి వచ్చే పథకాలను వినియోగిస్తే మరింత ఆదా చేసుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

ప్రీమియం వన్‌ప్లస్ ఫోన్లపై భారీ తగ్గింపులు.. ఆగస్టు ఆఫర్ల సునామీ!
OnePlus Independence Day Sale 2026: స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో ప్రీమియం, మధ్యత‌ర‌గ‌తి, తక్కువ ధర స్మార్ట్‌ఫోన్లతో పాటు ట్యాబ్లెట్లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, ఇతర డిజైన్‌లపై కూడా భారీ ధర తగ్గింపులు అందిస్తోంది. బ్యాంకు ఆఫర్లను కలిపి వినియోగిస్తే వినియోగదారులు మరింత తక్కువ ధరకే ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ప్రీమియం ఫోన్లపై భారీ తగ్గింపు

ఈ ప్రత్యేక ఆఫర్లలో వన్‌ప్లస్ 15 (12 జీబీ ర్యామ్ + 256 జీబీ నిల్వ) మోడల్‌పై రూ.4 వేల వరకు బ్యాంకు తగ్గింపు లభించనుంది. దీంతో దీని ధర రూ.81,999కు చేరుకోనుంది. అదే విధంగా 16 జీబీ ర్యామ్ + 512 జీబీ నిల్వ కలిగిన మోడల్‌ను రూ.89,999కు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 15ఆర్పై రూ.3 వేల వరకు తగ్గింపు లభించడంతో దీని ధర రూ.56,999కు అందుబాటులోకి రానుంది. అలాగే వన్‌ప్లస్ 13ఎస్పై రూ.2 వేల వరకు బ్యాంకు తగ్గింపుతో రూ.49,999కు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మధ్య తరగతి ఫోన్లకూ ఆకర్షణీయమైన ఆఫర్లు

మధ్య తరగతి ధరలో ఫోన్ కొనాలనుకునే వారి కోసం కూడా కంపెనీ ప్రత్యేక తగ్గింపులు ప్రకటించింది. వన్‌ప్లస్ నార్డ్ 6పై రూ.2,500 వరకు బ్యాంకు తగ్గింపుతో రూ.41,999 నుంచి అందుబాటులోకి రానుంది. నార్డ్ సీఈ 6 సిరీస్‌పై రూ.3 వేల వరకు తగ్గింపుతో రూ.31,999 ప్రారంభ ధరగా నిర్ణయించారు. ఇటీవల విడుదలైన వన్‌ప్లస్ ఎన్ 6, వన్‌ప్లస్ ఎన్ 6ఎక్స్ మోడళ్లు కూడా వరుసగా రూ.20,999, రూ.17,499 ప్రభావవంతమైన ధరలకు లభించనున్నాయి.

ఎక్కడ కొనుగోలు చేయవచ్చు?

ఈ ప్రత్యేక ఆఫర్లు అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, వన్‌ప్లస్ మొబైల్ అనువర్తనం, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న వన్‌ప్లస్ అనుభవ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. పరిమిత కాలం మాత్రమే ఈ ఆఫర్లు కొనసాగనున్నందున కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగానే బుక్ చేసుకోవడం మంచిదని కంపెనీ సూచిస్తోంది.

కొనుగోలు చేయడం లాభమేనా?

ప్రస్తుతం మొబైల్ ఫోన్ల తయారీ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్లు మంచి అవకాశంగా చెప్పవచ్చు. వేగవంతమైన పనితీరు, పరిశుభ్రమైన సాఫ్ట్‌వేర్ అనుభవం, ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీ, నాణ్యమైన కెమెరా వంటి ఫీచర్లను కోరుకునే వారికి వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15ఆర్ మంచి ఎంపికలు. మధ్యస్థాయి బడ్జెట్ ఉన్నవారికి నార్డ్ 6, తక్కువ ధరలో ఐదో తరం మొబైల్ సేవలు కావాలనుకునే వారికి ఎన్ 6, ఎన్ 6ఎక్స్ మోడళ్లు మంచి ఎంపిక అని చెప్పొచ్చు.