చండూర్ లో ఘోరం - 7 గురు  చిన్న పిల్లలపై కుక్కల దాడి 

చండూర్ లో ఘోరం - 7 గురు  చిన్న పిల్లలపై కుక్కల దాడి 

Untitled-1GGG విశ్వంభర, చండూర్ : కుక్కల దాడిలో 7గురు తీవ్రంగా గాయపడిన సంఘటన  నల్గొండ జిల్లా , చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని అంగడిపేట లో చోటు చేసుకుంది. ప్రధాన రహదారి పై వెళ్తున్న ప్రయాణికులతో పాటు , అక్కడే ఉంటున్న చిన్నారుల పైన కూడా ఘోరంగా దాడి చేసాయి. గత కొంతకాలంగా కుక్కల దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురిని గాయపరిచిన ఘటనలతో పాటు , దాడి చేసి చిన్నారులను చంపిన విషయం తెలిసిందే.. అయినా ఆయా ప్రాంతాలలో సరైన చర్యలు తీసుకోకపోవడంతో రెచ్చిపోతున్న కుక్కలు ప్రజలపై దాడులు చేసి ప్రాణాలు తీస్తున్నాయి. చండూర్ లో చాలాసార్లు మున్సిపల్  అధికారులకు విన్నవించుకున్నా కట్టడి చేయడంలో, అధికారులు పట్టించుకోకపోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. 

Tags: