ఇక అసెంబ్లీలో జగన్ వాయిస్ వినిపించదా.. కారణం ఇదే..!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నటి వరకు తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉన్నారు. అసెంబ్లీ నిండా ఆయన ఎమ్మెల్యేలే కనిపించేవారు. అంతటి పవర్ ను అనుభవించిన ఆయనకు.. ఇప్పుడు దారుణమైన పరిస్థితులు వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం అయి వైసీపీ దారుణమైన ఫలితాలను మూటగట్టుకుంది.
అయితే ఇప్పుడు ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే 18 ఎమ్మెల్యే సీట్లు కావాలి. గతంలో చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు గెలచుకున్నారు. కానీ అందులో నలుగురు వైసీపీలో చేరడంతో 19 మందితో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ కు ఆ పరిస్థితి లేదు.
దాంతో అసెంబ్లీలో ఆయన ప్రాధాన్యత తగ్గిపోతుంది. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుంది. పిఎస్, పిఏ తో పాటు సిబ్బంది అలవెన్సులు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు జగన్ ఎక్కడ కూర్చోవాలో కూడా స్పీకర్ నిర్ణయిస్తారు. అంతే కాకుండా అసెంబ్లీలో మాట్లాడేందుకు జగన్ కు ప్రాధాన్యం తగ్గిపోతుంది. రూల్స్ ప్రకారం నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడటానికి జగన్ కు అవకాశం ఉండదు.