రేపు స్పీకర్ ఎన్నికకు వైసీపీ దూరం.. కారణం అదే..
On
రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకుంటారు. అయితే సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్ ను అధికార, విపక్ష పార్టీల నేతలు కలిసి ఆయన్ను తన స్థానంలో కూర్చోబెట్టాలి. కానీ ఆ కార్యక్రమానికి వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
ఎందుకంటే రేపు వైఎస్ జగన్ పులివెందులలో వ్యక్తిగత పర్యటన ఉన్నందున వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ రావట్లేదని అంటున్నారు. అయితే దీనికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. మొన్న ఓ వ్యక్తితో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. జగన్ ఓడిపోయాడు అంతే.. ఇంకా చావలేదు అంటూ మాట్లాడారు. దారిపై వైసీపీ చాలా సీరియస్ గా ఉంది. అందుకే ఆయన ఎన్నికకు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.