త్వరలో ఒకే వేదిక మీదకు చంద్రబాబు, రేవంత్
రాజకీయాల్లో చంద్రబాబు, రేవంత్ గురు, శిష్యులు అని మనందరికీ తెలిసిందే. టీడీపీలోనే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది. చంద్రబాబు అండదండలతోనే ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగారని అంటుంటారు. ఇక ఇప్పుడు ఇద్దరు గురు, శిష్యులు తెలంగాణ, ఏపీకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు.
అయితే మొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ వెళ్తారని అనుకున్నా.. అది జరగలేదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. ప్రపంచ కమ్మ మహాసభను హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నారు.
ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు. అంటే చంద్రబాబు, రేవంత్ మొదటిసారి సీఎం హోదాల్లో పలకరించుకుంటారన్నమాట.