బీజేపీతో టచ్ లోకి వైసీపీ ఎంపీ.. ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీజేపీతో టచ్ లోకి వైసీపీ ఎంపీ.. ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు వేరే పార్టీల్లోకి వెళ్లిపోతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఇందుకు బలం చేకూర్చే విధంగా తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీతో టచ్ లోకి వచ్చారంటూ బాంబ్ పేల్చారు. 

మిథున్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. త్వరలోనే ఆయన పార్టీ మారుతారంటూ తెలిపారు. ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకత్వంతో మిథున్ రెడ్డి టచ్ లోకి వెళ్లారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ఖాళీ అవడం ఖాయం అని.. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్‌ రెడ్డి తప్ప మిగతా ఎంపీలంతా బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ఆదినారాయణ రెడ్డి చెప్పారు.

Read More స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ

కాగా వైసీపీ ఎంపీలు అవసరం లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నా కూడా.. మిథున్ రెడ్డి మాత్రం చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ తెలిపారు. అయితే నారాయణ రెడ్ది వ్యాఖ్యలపై ఇప్పటి వరకు మిథున్ రెడ్డి మాత్రం స్పందించట్లేదు. దాంతో ఆయన చేరిక ఖాయమే అని అంటున్నారు.