రాజకీయాల్లో రామోజీ కింగ్ మేకర్ః రజినీకాంత్

రాజకీయాల్లో రామోజీ కింగ్ మేకర్ః రజినీకాంత్

 

రామోజీరావు మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రామోజీ రావుకు ఇటు రాజకీయ పార్టీలతో పాటు అటు సినీ హీరోలతో కూడా ఎంతో అనుబంధం ఉంది. అందుకే అందరూ ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. 

Read More కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి:గ్రామసభలో సీపీఎం డిమాండ్

ఈ సందర్భంగా రజినీకాంత్ కూడా స్పందించారు. రామోజీరావు తన గురువు మాత్రమే కాదని.. మార్గదర్శకుడు అని కొనియాడారు. జర్నలిజం, సినిమాల్లో చరిత్ర సృష్టించిన ఆయన.. రాజకీయాల్లో కింగ్ మేకర్ అని చెప్పారు. ఆయన వల్ల తన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్టు తెలిపారు రజినీకాంత్. ఆయనలాంటి వ్యక్తి అందరికీ గర్వకారణం అని చెప్పుకొచ్చారు రజినీకాంత్. రామోజీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు సూపర్ స్టార్.