పవన్ కల్యాణ్‌కు కలిసొచ్చిన ‘21’

పవన్ కల్యాణ్‌కు కలిసొచ్చిన ‘21’

  • 21 స్థానాల్లో పోటీ చేసి విజయం
  • 21 ఎమ్మెల్యేలతో 21వ తారీఖున ప్రమాణ స్వీకారం
  • నెట్టింట పవన్ అభిమానుల పోస్టులు 

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ‘21’ నెంబర్ బాగా కలిసివచ్చిందని జన సైనికులు అంటున్నారు. టాలీవుడ్‌లో అగ్రహీరోగా ఉన్న పవన్ కల్యాణ్ రాజకీయాలపై మక్కువతో 2019 ఎన్నికలతో ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టారు. భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఆయా స్థానాల్లో ఘోర ఓటమిని చవి చూశారు. 

అయితే, రెండోసారి 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో జత కట్టి 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులతో కలిసి బరిలో నిలిచారు. ఈసారి పవన్ ఒకే ఒక్క నియోజకవర్గం (పిఠాపురం) నుంచి పోటీ చేసి భారీ మెజారిటీని కైవసం చేసుకున్నారు. తన సమీప అభ్యర్థి వైఎస్సార్సీపీ నాయకురాలు వంగ గీతపై 70,354 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

Read More స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ

అంతేకాదు.. జనసేన అభ్యర్థులు 21మంది పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఇవాళ(శుక్రవారం) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. ‘21 సీట్లు తీసుకుని, 21 సీట్లు గెలిచి, 21మంది ఎమ్మెల్యేలతో 21వ తేదీన అసెంబ్లీలో అడుగుపెట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు’ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో 21 నెంబర్ పవన్ ‌కల్యాణ్‌కు బాగా కలిసివచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts