‘పవన్ వ్యక్తి కాదు.. తుపాన్..’ జనసేనానికి మోడీ ప్రశంసలు

‘పవన్ వ్యక్తి కాదు.. తుపాన్..’ జనసేనానికి మోడీ ప్రశంసలు

ఎన్డీయే లోక్ సభ పక్షనేతగా మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మోడీ ప్రసంగిస్తూ దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావిస్తూ ఏపీ నేతలను అభినందించారు. ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను నరేంద్ర మోడీ ప్రశంసించారు. పవన్ కల్యాణ్ వ్యక్తి కాదని.. ఆయన ఒక తుపాన్ అంటూ కొనియాడారు. పార్లమెంట్ భవన్‌లో ఇవాళ నిర్వహించిన ఎన్డీయే కూటమి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీయే లోక్ సభ పక్షనేతగా మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మోడీ ప్రసంగిస్తూ దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావిస్తూ ఏపీ నేతలను అభినందించారు. ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టిందని మోడీ వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సాధించామని వెల్లడించారు. అదేవిధంగా ఎన్డీయే ఎంపీల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జనసేన తరఫున మోడీకి హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని, మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికీ భారత్ తలొగ్గదన్నారు. మోడీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని పవన్ కల్యాన్ పునరుద్ఘాటించారు.

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

Related Posts