టీడీపీ ఏపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్.. త్వరలోనే ప్రకటన..!
ఏపీలో ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇందులో మెజార్టీ పదవులన్నీ టీడీపీకే దక్కాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇదంతా టీడీపీ ప్రభుత్వంలాగానే ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడికి కూడా మంత్రి పదవి దక్కింది. అచ్చెన్నాయుడు ప్రస్తుతం టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి వరించింది కాబట్టి కొత్త అధ్యక్షుడిని నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారంట.
ఇందుకోసం పల్లా శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పల్లా శ్రీనివాస్ మొన్నటి ఎన్నికల్లో గాజువాక నుంచి అమర్నాథ్ మీద 95 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఉమ్మడి విశాఖ నుంచి వంగలపూడి వనితకు మాత్రమే మంత్రి పదవి దక్కింది. దాంతో ఇప్పుడు విశాఖ సీనియర్లకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని చూస్తున్నారంట.
అయ్యన్న పాత్రుడి పేరు పరిశీలించినా.. యువకుడు అయిన శ్రీనివాస్ కే పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారంట. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని సరిగ్గా ఎవరూ పట్టించుకోవట్లేదు కాబట్టి.. ఈసారి అలా జరగకుండా పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఉండేలా పనిచేయాలని భావిస్తున్నారంట చంద్రబాబు. అందుకే పల్లా శ్రీనివాస్ యాదవ్ కు ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.