మాజీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
- ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణాలు
- ఎక్స్ వేదికగా ఫొటోలు షేర్ చేసి మండిపాటు
- వాటిని కూల్చకుండా స్కూళ్లు, ఆస్పత్రులకు ఇవ్వాలంటున్న నెటిజన్లు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యాలయాల నిర్మాణాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వివిధ జిల్లాల్లోని వైసీపీ కార్యాలయ భవనాల ఫొటోలను ట్వీట్ చూస్తూ నిప్పులు చెరిగారు. ‘‘జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు.’’ అని పేర్కొన్నారు.
అదేవిధంగా ‘‘జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన రూ.600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?’’ అంటూ మండిపడ్డారు.
అదేవిధంగా అనుమతులు లేకుండా నిర్మించిన ఈ వైసీపీ కార్యాలయాలను కూల్చొద్దని మంత్రి లోకేశ్‌కు నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. అంత భారీ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు బదులుగా ప్రభుత్వ స్కూళ్లకు, ఆసుపత్రులకు ఇచ్చే అవకాశముంటే ఇవ్వాలని కోరుతున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు సంయుక్తంగా మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42… pic.twitter.com/tThP2mDMPh
— Lokesh Nara (@naralokesh) June 23, 2024