పవన్ అనే నేను.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని..!
పవన్ తో పాటు మరో ఇద్దరికి ఛాన్స్
నాదెండ్ల మనోహర్ తో పాటు కందుల దుర్గేకు పదవులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మొదటిసారే మంత్రికాబోతున్నారు. దాంతో జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ కల్యాణ్ స్టేజి మీద ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఫ్యాన్స్ అరుపులతో ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది.
అమరావతిలోని కేసరపల్లి వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. అయితే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించినా.. మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఇక పవన్ కల్యాణ్ తో పాటు జనసేన నుంచి మరో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కింది. జనసేన నుంచి పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ లు ప్రమాణ స్వీకారం చేశారు.



