కాలినడకన తిరుమల కొండ ఎక్కిన మెగా హీరో

కాలినడకన తిరుమల కొండ ఎక్కిన మెగా హీరో

  • బాబాయి గెలుపుతో మొక్కు తీర్చుకున్న అబ్బాయి
  • కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న సాయిధరమ్ తేజ్ 

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ తిరుమల కొండకు కాలనడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాడు. ఎన్నికల్లో తన బాబాయి పవన్ కల్యాణ్ గెలిస్తే కాలినడకన తిరుమల వస్తానని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మొక్కుకున్నాడు. ఆ మొక్కును తీర్చుకోవడానికి సాయిధరమ్‌తేజ్ కాలినడకన తిరుమలకు వెళ్లాడు. ఎన్డీయేలో భాగం అయిన జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లకు గాను 21 విజయం సాధించిన విషయం తెలిసిందే. 

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్ర ఎంతో ఉందనే చెప్పాలి. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసినా పవన్ కల్యాణ్ ఎంతో ఓర్పుతో వ్యవహించారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కూడదు అనే ఉద్దేశంతో ఈసారి టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేశారు. పవన్‌కు తోడుగా పిఠాపురంలో ఆయన గెలుపునకు మెగా ఫ్యామిలీ అండగా నిలిచింది. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపారు. ఫలితంగా పవన్ అద్భుత విజయం సాధించడంతో సాయి ధరమ్ తేజ్ తిరుమలకు కాలినడకన వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Posts