బాబాయ్ ని చంపినట్టే జగన్ జనాన్ని చంపుతున్నారు...లోకేష్ సంచలన వ్యాఖ్యలు

బాబాయ్ ని చంపినట్టే జగన్ జనాన్ని చంపుతున్నారు...లోకేష్ సంచలన వ్యాఖ్యలు

విశ్వంభర, అమరావతి : బాబాయిని చంపినట్టే జగన్ జనాన్ని చంపుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని మండిపడ్డారు. కర్నూలు లో టీడీపీ నేత గౌరీ నాథ్ ను వైసీపీ నేతలు దారుణంగా హత్య చేయించారని అన్నారు. ఈ పార్టీ ఫ్యాక్షన్ పాలన వద్దని ఎన్నికల్లో జనం ఛీకొట్టారని తెలిపారు. హత్యా రాజకీయాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గౌరీనాథ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ దాడులకు చెక్ పెట్టి శాంతి భద్రతలను కాపాడతామని తెలిపారు.