వారిని వదిలిపెట్టను.. రెడ్ బుక్ పై స్పందించిన లోకేష్‌..

వారిని వదిలిపెట్టను.. రెడ్ బుక్ పై స్పందించిన లోకేష్‌..



తప్పుడు కేసులు పెట్టారంటూ ఆగ్రహం
చట్టం ముందు అందరూ సమానమే అంటూ హెచ్చరిక

ఏపీలో ఇప్పుడు అనూహ్యంగా కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఎవరూ ఊహించనంత భారీ మెజార్టీ రావడంతో కూటమి నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇదే విషయంలో ఇప్పుడు ఏపీలో కవ్వింపు చర్యలు బాగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతల ఇండ్ల ముందు టీడీపీ నేతల హంగామా ఎక్కువ అవుతోంది. 

ఈ క్రమంలోనే లోకేష్ రెడ్ బుక్ మీద స్పందించారు. తాజాగా ఆయన ఏఎన్ ఐ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెడ్ బుక్ లో రాసుకున్న అధికారుల పేర్లు, నేతల పేర్ల మీద స్పందించారు. బుక్ లో రాసుకున్న వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ ఆయన తెలిపారు. తనపై అక్రమంగా 26 తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

తనను రాజకీయంగా అణగదొక్కేందుకు అట్రాసిటీ కేసులు కూడా పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్. తప్పులు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటూ తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమే అని.. కాబట్టి ఎవరిని చట్టం వదిలిపెట్టదంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

 

 

Related Posts