ఎవరు బెదిరించినా భయపడను.. కొడాలి నాని
ఏపీలో ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని మొదటిసారి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఫలితాలు పాచికలు వేసినట్టే జరిగాయన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి కావాల్సినట్టుగా పాచికలు పడ్డాయని.. అవి కూడా ఢిల్లీ నుంచే పడ్డాయంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు కొత్త కాదంటూ వ్యాఖ్యానించారు.
తాను ఎన్నటికీ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. తమ పార్టీకి ప్రజల మద్దతు ఉందని.. మొన్నటి ఎన్నికల్లో 1.30 కోట్ల ప్రజలు ఓట్లు వేశారని.. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. కూటమికి ఆరు నెలల సమయం తమ పార్టీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఎవరు బెదిరించినా భయపడేది లేదని.. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యల కోసమే టీడీపీ కూటమి ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టేసి.. పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నాడని విమర్శలు గుప్పించారు కొడాలి నాని.