అలా ఓడిపోతే సిగ్గుపడాలా.. తలెత్తుకుని తిరుగుదాం.. రోజా స్పందన..

అలా ఓడిపోతే సిగ్గుపడాలా.. తలెత్తుకుని తిరుగుదాం.. రోజా స్పందన..

 

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి మాజీ మంత్రులు ఎవరూ పెద్దగా బయటకు రావట్లేదు. ఎందుకంటే మాజీ మంత్రుల్లో ఒక్క పెద్దిరెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారిలో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. ఆమె కూడా నగరిలో గాలి భాను చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 

Read More  రెండో రోజు దావోస్‌లో సీఎం చంద్రబాబు

అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఆమె మరో పోస్టు కూడా పెట్టారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల! కానీ.. మంచి చేసి ఓడి పోయాం! గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం! ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అంటూ ఆమె ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. దాంతో అది కాస్తా వైరల్ అవుతోంది. 

అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉందండోయ్.. దీనికి ఆమె కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేశారు. కామెంట్లు చేస్తే తనకు వ్యతిరేకంగానే వస్తున్నాయని ఆమె గ్రహించారు కాబోలు. అందుకే ఇలా ఆఫ్ చేసుకున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో ఆమె పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే వైసీపీ మంత్రులందరూ ఓడిపోయారని టాక్ నడుస్తోంది.

Related Posts