‘నీ బిడ్డనైనందుకు గర్విస్తున్నా నాన్న..’ వైఎస్ షర్మిల ఎమోషనల్
- తండ్రి ఫొటోను షేర్ చేసిన ఏపీసీసీ చీఫ్
- నీ పట్టువదలని పోరాటపటిమే నా ఆస్తి అంటూ ట్వీట్
ఫాదర్స్ డేను పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వారి తండ్రులను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్ వారి తండ్రుల ఫొటోలను షేర్ చేస్తూ ప్రపంచంలో ఉన్న తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ పోస్టులు పెట్టారు. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఎక్స్(ట్విట్టర్) వేదికగా వైఎస్సార్‌తో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ‘నీ పట్టువదలని పోరాటపటిమను ఆస్తిగా ఇచ్చి ఆగకుండా సాగిపోయేలా నన్ను తీర్చిదిద్దావు. నీ అమూల్యమైన ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపి సవాళ్ళను ఎదుర్కొనేలా తయారు చేసావు. మనిషిని ప్రేమ, సంస్కారం, కరుణతో గెలవాలనే సూత్రంతో నా వ్యక్తిత్వాన్ని మలిచావు. నీ బిడ్డనైనందుకు గర్విస్తున్నా. ప్రజలకోసం పాటుపడే నీ ఓర్పును, నిబద్ధతను వారసత్వంగా చేసుకుని ముందుకు సాగుతున్నా. నువ్వెక్కడున్నా నీ ఆశీర్వాదం, అనురాగం, మార్గదర్శనం నాతో ఉన్నాయని తలుస్తాను’ అంటూ షర్మిల ట్వీట్‌లో పేర్కొన్నారు.
నీ పట్టువదలని పోరాటపటిమను ఆస్తిగా ఇచ్చి ఆగకుండా సాగిపోయేలా నన్ను తీర్చిదిద్దావు
— YS Sharmila (@realyssharmila) June 16, 2024
నీ అమూల్యమైన ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపి సవాళ్ళను ఎదుర్కొనేలా తయారు చేసావు
మనిషిని ప్రేమ, సంస్కారం, కరుణతో గెలవాలనే సూత్రంతో నా వ్యక్తిత్వాన్ని మలిచావు
నీ బిడ్డనైనందుకు గర్విస్తున్నాను
ప్రజలకోసం… pic.twitter.com/QS7VqQcHBb