ఏపీ ప్రభుత్వంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు..?
విశ్వంభర, విశాఖపట్నంః ఏపీలో ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరింది. చంద్రబాబు సీఎం అని ఇప్పటికే ప్రకటించారు. దాంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని పదవులు అనేది అందరికీ ఆసక్తిగా మారిపోయింది. ఇప్పుడు టీడీపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సీట్లు వచ్చాయి. అయినా సరే కూటమి పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
అయితే ఏపీ ప్రభుత్వంలో సీఎంతో కలిపి 26 మంది మంత్రులకు మించి ఉండొద్దు. దాంతో ఇప్పుడు టీడీపీకి చంద్రబాబుతో కలిపి 20 మంత్రి పదవులు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక జనసేనలో ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా 5 మంత్రి పదవులు ఆశిస్తున్నట్టు చెబుతున్నారు.
కాగా ఇక బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. దీనిపై రేపు అంటే మంగళవారం నాడు క్లారిటీ రాబోతోంది. అయితే పవన్ కల్యాన్ కు ఈ సారి డిప్యూటీ సీఎం పదవి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో జాతీయ మీడియాతో ఆయన ఈ పదవి తీసుకోవడానికి సుముఖంగానే ఉన్నట్టు చెప్పారు.