రెడ్ బుక్ మీద స్పందించిన హోం మంత్రి అనిత
హోం మినిస్టర్ అనిత మొదటిసారి రెడ్ బుక్ మీద స్పందించారు. గత ఎన్నికల సమయంలో నారా లోకేష్ కొందరు అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ బుక్ లో రాసుకున్న అధికారుల పేర్లపై తాజాగా అనిత స్పందించారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు.
తమ నాయకుడి మాటకు విలువ ఇచ్చి తాము సైలెంట్ గానే ఉంటున్నామని.. ఎవరినీ ఏమీ అనట్లేదని స్పష్టం చేశారు. రెడ్ బుక్ లో కేవలం సరిగ్గా పనిచేయని అధికారుల పేర్లు మాత్రమే అందులో ఉంటాయన్నారు. ప్రజలు తమ కూటమిని నమ్మి 164 సీట్లు ఇచ్చారని.. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రధాన ఎజెండా గంజాయి నిర్మూలన, మహిళా భద్రత, పోలీసులకు సౌకర్యాలు, పోలీసుశాఖలో దరఖాస్తుల భర్తీ అన్నారు. గత ప్రభుత్వంలో పోలీసు స్టేషన్ల కనీస అవసరాలకు రూ. 8వేలు కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఒక్కో పోలీసు స్టేషన్ కనీస అవసరాల నిమిత్తం నెలసరి ఖర్చుకు రూ. 75వేలు ఇస్తున్నారని చెప్పారు.