తెలుగు రాష్ట్రాల సీఎంల జీతాలు ఎంతో తెలుసా.. దేశంలో ఎవరికి ఎక్కువంటే..?

తెలుగు రాష్ట్రాల సీఎంల జీతాలు ఎంతో తెలుసా.. దేశంలో ఎవరికి ఎక్కువంటే..?

 

ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే వారికి జీతాలు కూడా బాగానే ఉంటాయి. ఇక మన దేశంలో కూడా సీఎంలకు జీతాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, స్థితిగతులను బట్టి ఉంటాయి. ఇక దేశంలోనే అత్యధికంగా తెలంగాణ సీఎం జీతం తీసుకుంటున్నారు. తెలంగాణ సీఎం జీతం ఏకంగా రూ.4,10,000 గా ఉంది. 

Read More తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాపై కీలక ప్రకటన

ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ సీఎం జీతం రూ. 3,90,000 ఉంది. మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ రూ. 3,65,000 గా ఉంది. ఇక నాలుగో స్థానంలో మహారాష్ట్ర సీఎం జీతం రూ. 3,40,000గా ఉంది. ఐదో స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జీతం ఉంది. ఏపీ సీఎం జీతం నెలకు రూ.3,35,000గా ఉంది. 

ఇక ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా విమానాలు, హెలికాఫ్టర్లను కలిగి ఉంటుంది. అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం సమయాన్ని ఆదా చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. దాంతో పాటు మంత్రులు, ఇతరులకు కూడా వీటిని ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విమానాలు, హెలికాఫ్టర్లు బాగానే ఉన్నాయి.