ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
విశ్వంభర, అమరావతిః ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి వారానికి ఐదు రోజుల పని విధానం నేటితో ముగిసిపోతోంది. దాంతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసింది.
దానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. గతంలో ఏపీ విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని అమరావతికి తరలించారు. అందుకే వారంతంలో ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి రావడానికి వీలుగా చంద్రబాబు అప్పట్లోనే ఈ ఐదు రోజుల పని విధానాన్ని తీసుకువచ్చారు.
తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీఎం అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేందుకు అంగీకరించారు. మరో ఏడాది పాటు ఈ విధానమే అమలులో ఉంటుందని ఉత్తర్తులు జారీ చేశారు సీఎం చంద్రబాబు. దాంతో ఉద్యోగులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.