రామోజీరావు మరణంపై చిరంజీవి, పవన్, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్స్..!
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడు అయిన రామోజీరావు మరణంపై ఇప్పటికే సినీ, రాజకీయ దగ్గజాలు సంతాంప వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్రమోడీ కూడా స్పందించారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలతో ఎంతో సన్నిహితం ఉండటం వల్ల వారు కూడా ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ట్విట్టర్ లో.. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం .. దివి కేగింది అంటూ రాసుకొచ్చారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. నన్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిందే రామోజీరావు అని గుర్తు చేసుకున్నారు. నిన్నుచూడాలని సినిమాలో నాకు హీరోగా అవకాశం కల్పించారని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను మర్చిపోలేనంటూ తెలిపారు.ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
అత్యంత బాధాకారం - పవన్ కల్యాణ్
రామోజీరావు మరణంపై పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు. 'మీడియా రంగానికి ఇది తీరని లోటు. భారత సినీరంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి ఎంతో కృషి చేశారు" అని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. వీరే కాకుండా ఇంకా చాలామంది సంతాపం తెలుపుతున్నారు.