తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.. జగన్ కు చంద్రబాబు వార్నింగ్..!
చంద్రబాబును మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలపై మాట్లాడారు. తనను ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఇప్పుడు నిర్మాణాత్మక అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
ఇక ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చి దిద్దుతామన్నారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో ఎవరూ కూడా పదవి వచ్చిందని విర్రవీగొద్దంటూ తెలిపారు. ఇక ఇదే సందర్భంగా జగన్ కు ఇన్ డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.
తప్పు చేసిన వారికి శిక్ష పడాలని.. లేదంటే అదే తప్పు చేయడం వారికి అలవాటుగా మారుతుందని ఆయన తెలిపారు. నా కుటుంబానికి అవమానం జరిగింది. అది కౌరవ సభ అని గౌరవ సభగా మార్చిన తర్వాతనే వస్తానని చెప్పి బయటకు వచ్చాను. ప్రజలు నా తీర్పును గౌరవించారు. కాబట్టి ప్రజలను నిలబెట్టాలి అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. చంద్రబాబు మాటలను బట్టి చూస్తుంటే జగన్ ను వదిలిపెట్టబోరని తెలుస్తోంది.