కువైట్ మృతులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా: చంద్రబాబు

కువైట్ మృతులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా: చంద్రబాబు

కువైట్ అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన వారు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కువైట్‌లో మృతి చెందించిన ఆంధ్రప్రదేశ్ వాసులకు సీఎం చంద్రబాబు నష్ట పరిహారం ప్రకటించారు. రూ. 5 లక్షలు సాయమందిస్తామని హామీ ఇచ్చారు.

కువైట్ అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన వారు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కువైట్‌లో మృతి చెందించిన ఆంధ్రప్రదేశ్ వాసులకు సీఎం చంద్రబాబు నష్ట పరిహారం ప్రకటించారు. రూ. 5 లక్షలు సాయమందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
 
మరోవైపు కువైట్ అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలు భారత్‌కు చేరుకున్నాయి. ఇందులో కేరళ వారే ఎక్కువగా ఉన్నారు. మృతదేహాల రాకతో ఢిల్లీ, కొచ్చి విమానాశ్రయాలు రోదనతో మిన్నంటాయి. అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం సి-130 జె ద్వారా శుక్రవారం స్వదేశానికి తీసుకువచ్చింది.