మోడీ లాంటి పవర్‌ఫుల్ వ్యక్తిని చూడలేదు: చంద్రబాబు

మోడీ లాంటి పవర్‌ఫుల్ వ్యక్తిని చూడలేదు: చంద్రబాబు

మోడీలాంటి పవర్‌ఫుల్ వ్యక్తిని తానెన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్లమెంట్ భవన్‌లో ఇవాళ(శుక్రవారం) ఎన్టీఏ కూటమి నేతలు, బీజేపీ, ఎన్డీఏ పక్ష ఎంపీలు సమావేశమయ్యారు.

మోడీలాంటి పవర్‌ఫుల్ వ్యక్తిని తానెన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్లమెంట్ భవన్‌లో ఇవాళ(శుక్రవారం) ఎన్టీఏ కూటమి నేతలు, బీజేపీ, ఎన్డీఏ పక్ష ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్‌గా మారిందన్నారు. 

తన రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను చూశానని, అయితే నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదని చెప్పుకొచ్చారు. మేకిన్ ఇండియా, విజినరీతో మోడీ.. దేశానికి అద్భుత విజయాలు అందించారని ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలోనూ మోడీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని తెలిపారు. మోడీ విజన్, సమర్థత దేశానికి ఎంతో అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భారత్‌కు సరైన సమయంలో సరైన నాయకుడు దొరకాడని మోడీని ఆకాశానికి ఎత్తేశారు. 

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే ఐదో ఆర్థికశాఖగా ఎదిగిందని, ఈ ఐదేళ్లలో ప్రపంచంలోనే రెండో లేదా మూడో ఆర్థిక శక్తిగా మారబోతోందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. దేశంలో ఉన్న యువశక్తి ఐటీ రంగంలో దూసుకుపోతోందని, ఎన్డీఏతో ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ప్రజలకు ఎంతో సేవ చేశారని గుర్తుచేశారు. ఆయన తరహాలోనే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎంతో విజన్‌తో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఎన్డీఏ కూటమి, బీజేపీ ఎంపీల సమావేశంలో టీడీపీ, జేడీఎస్, ఎన్సీపీ, జనసేన, అప్నాదళ్ ఎంపీలు, నేతలు పాల్గొన్నారు.

Related Posts