బాలయ్య బర్త్‌డే.. చంద్రబాబు స్పెషల్ విషెస్..!

బాలయ్య బర్త్‌డే.. చంద్రబాబు స్పెషల్ విషెస్..!

టీడీపీ నేత‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ‌ జన్మదిన వేడుకలను ఇవాళ(సోమవారం) ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

‘తెలుగు సినిమా రంగంలో అన్ స్టాపబుల్ అనిపించుకున్న అగ్రహీరో, హిందూపురం శాసనసభ్యులు, నా ఆత్మీయుడు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.  సినీ, రాజకీయ రంగాల్లో  తిరుగులేని ప్రజాదరణతో నిండు నూరేళ్ళూ ఆనంద, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Read More రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కొరకే మా పోరాటం:ధర్మ సమాజ్ పార్టీ 

దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, బాలయ్య అభిమానులు ఈ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు. ఈ ట్వీట్‌కు పలువురు అభిమానులు గతంలో చంద్రబాబుతో బాలయ్య దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 'నా ముద్దుల బాలా మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.