ఏపీ సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఈ నెలాఖరు వరకు ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఈ నెలాఖరు వరకు ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇప్పుడు సీఎస్ సెలవు మీద వెళ్ళగానే కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం ఉండగా ఆయన స్థానంలో ఇంతకు ముందు కె. విజయానంద్‌ను నియమిస్తారని కథనాలు వచ్చాయి.
కానీ ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం బట్టి కొత్త సీఎస్‌గా 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్ ప్రసాద్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం సీఎస్ జవహార్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన గతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం అటవీ, పర్యావరణ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన తర్వాత అనంతరాములు, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, రజత్ భార్గవ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయినప్పటికీ నీరభ్ కుమార్ ప్రసాద్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
ఏపీ నూతన సిఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్
— Telugu Scribe (@TeluguScribe) June 7, 2024
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. pic.twitter.com/XQh15Q0sE9



