ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

 

ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 
ఎగ్జామ్స్ గతంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం (జూన్‌ 27) విడుదలయ్యాయి. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఈ మేరకు ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాది ఎడ్ సెట్ ను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్‌ 8వ తేదీన ఎడ్‌సెట్‌ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. ఈ ఫలితాల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగానే కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు.