ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

  • ఏపీ శాసనసభలో సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం 
  • తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్
  • ఫుల్ జోష్‌లో జనసైనికులు
  • పవన్‌ను ఆలింగనం చేసుకున్న సీఎం చంద్రబాబు 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు(శుక్రవారం), రేపు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 

ఆ తర్వాత మిగతా మిగతా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు అనంతరం మిగిలిన ఎమ్మెల్యేల అక్షర క్రమం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తొలిసారిగా పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌లు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా రేపు ఎమ్మెలంతా రేపు(శనివారం) స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. మాజీ సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు అసెంబ్లీకి హాజరయ్యారు. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ తొలిసారి శాసనసభలో అడుగుపెట్టడంతో జనసైనికులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Related Posts