19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. సీఎంగా చంద్రబాబు, మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇంకా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. దాంతో పాటు ప్రభుత్వం ఏర్పడ్డ నెల వ్యవధిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం నాలుగు రోజులు పాటు సమావేశాలు సాగుతాయి. మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగనుంది. రెండో రోజు స్పీకర్ ను ఎన్నుకుంటారు. తర్వాత మూడో రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.
నాలుగో రోజు ఇతర విషయాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 18న మొదటి కేబినెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమాచారం వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే జగన్ మొదటి సమావేశానికి వస్తారా రారా అనేది అందరికీ సందేహంగానే ఉంది.