జనసేనకు మరో కీలక పదవి.. అవకాశం ఎవరికో..?
ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు జనసేనకు మరింత కీలక భాగస్వామ్యం ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అసలు టీడీపీకి అన్ని సీట్లు రావడానికి కూడా జనసేనతో పొత్తులే కారణం అని అంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారంట.
ఇప్పటికే పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలను అప్పగించారు. దాంతో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కీలక శాఖలే ఇచ్చారు. ఇక ఇప్పుడు జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని చూస్తున్నారంట. అది కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వాలని చూస్తున్నారు.
అలా అయితే జనసేనాని నిర్ణయిస్తే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి అవకాశం దక్కనుంది. జనసేన నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమెనే. కాబట్టి ఇప్పుడు ఆమెకు అవకాశం దక్కుతుందని అనుకుంటున్నారు. వైసీపీ హయాంలో కూడా బ్రాహ్మణులకే డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది కాబట్టి.. ఇప్పుడు కూడా ఆ సామాజిక వర్గానికే ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.