నెల్లూరు జిల్లాలో ఊహించని ఘటన.. కారుపై పెద్దపులి దాడి 

నెల్లూరు జిల్లాలో ఊహించని ఘటన.. కారుపై పెద్దపులి దాడి 

  • నెల్లూరు-ముంబై హైవేపై ఘటన
  • కారులో ఐదుగురు ప్రయాణికులు సురక్షితం
  • స్వల్పంగా దెబ్బతిన్న కారు 

ఏపీలోని నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఊహించని సంఘటన జరిగింది. శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా(నెల్లూరు) మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లిలో పెద్దపులి దాడి కలకలం రేపింది. నెల్లూరు-ముంబై హైవేపై వెళ్తున్న కారుపై దాడికి దిగింది. దీంతో దీంతో కారులోని ప్రయాణిస్తున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.  శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె సమీపంలో నెల్లూరు- ముంబయి హైవేపై బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో నెల్లూరు వెళ్తున్నారు. ఈ క్రమంలో కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటుతూ కారుకు అడ్డంగా వచ్చింది. వేగంగా వస్తున్న కారు పులిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

అప్రమత్తమైన కారు డ్రైవర్ శ్రీనివాసులు కారు బ్రేక్ వేయడంతో అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు వారంతా ఊపిరిపీల్చుకున్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లి కూంబింగ్ చేయనున్నట్లు తెలిపారు. పెద్దపులి సంచారంతో మర్రిపాడు మండలంలోని అటవీ ప్రాంత గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

Related Posts