అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్..!
ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలిసిందే. భారీ జనసమీకరణ జరుగుతుందనే సమాచారం ముందస్తుగా ఇవ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ప్రభావం పోలీసులపై పడింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదం నేపథ్యంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజును వీఆర్‌కు పంపిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలిసిందే. భారీ జనసమీకరణ జరుగుతుందనే సమాచారం ముందస్తుగా ఇవ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ రఘువీర్‌రెడ్డి, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 11న అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. శిల్పా రవి అల్లు అర్జున్‌కు ఫ్రెండ్ కావడంతో ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్ ఆయన తరఫున అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు. అయితే, అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో వేలాది మంది జనం అక్కడకు చేరుకున్నారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపైనా కేసు నమోదైన విషయం తెలిసిందే.