భార్య మీద అనుమానంతో కూతురుని చంపేసిన కసాయి తండ్రి

భార్య మీద అనుమానంతో కూతురుని చంపేసిన కసాయి తండ్రి



తండ్రి అంటే కూతురును కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తి. అలాంటి తండ్రి కసాయిగా మారి కూతురును హతమార్చిన ఘటన తాజాగా అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న గణేశ్ కు అమలతో పెళ్లైంది. ఇద్దిరికీ కొడుకుతో పాటు ఆరేండ్ల పాప కూడా ఉంది. 

అయితే పాప తనకు పుట్టలేదనే అనుమానం గణేశ్ లో ఉంది. చాలాకాలంగా భార్యాభర్తల నడుమ మనస్పర్థలు వస్తున్నాయి. దాంతో ఇద్దరూ తరచూ గొడవ పడుతున్నారు. ఇక గణేశ్ ఇంటిని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఇంటి బాధ్యతలను మొత్తం భార్య అమలనే చూసుకుంటోంది. అయితే గురువారం సాయంత్రం స్కూల్ నుంచి తన పాపను తీసుకెళ్తున్నట్టు స్కూల్ యాజమాన్యానికి చెప్పి తీసుకెళ్లాడు.

అదే గ్రామంలోని ఓ పాడుబడ్డ బావి వద్దకు పాపను తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత పాప డెడ్ బాడీని బావిలో పడేశాడు. ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లడంతో.. పాప మిస్ అయిందని భార్యతో కలిసి కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు గాలిస్తున్న సమయంలో.. గణేశ్ ఆ పాడుబడ్డ బావి వద్ద రెండు, మూడు సార్లు కనిపించాడు. దాంతో ఆయన్ను గట్టిగా నిలదీసే సరికి.. తాను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు గణేశ్.