ఐరా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వరంలో భారీ రైతు ప్రదర్శన క్షేత్రం

నమ్మకమైన నాణ్యమైన విత్తనాలకు కేరాఫ్ గా ఐరా సీడ్స్

  • ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వస్తుంది
  • పలు గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన రైతులు

WhatsApp Image 2025-01-20 at 15.19.28

విశ్వంభర, కారేపల్లి: ఖమ్మంజిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని పాటి మీద గుంపు గ్రామంలో ఐరా సీడ్స్ వారి ఆధ్వర్యంలో భారీ రైతు ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాయి కృష్ణ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ యజమాని వెదుళ్ళ మురళి మాట్లాడుతూ రైతులకు నమ్మకమైన నాణ్యమైన విత్తనాలు కేరాఫ్ గా ఐరా సీడ్స్ వారి స్నైపర్ (AVHP 610) మిర్చి రకం అధిక దిగుబడి వస్తుందని ఆయన పేర్కొన్నారు. పాటిమీద గుంపు గ్రామానికి చెందిన భూక్య రమేష్ అనే రైతు రెండు ఎకరాల భూములలో.స్నైపర్F1. అనే కొత్త రకం వేశారు. ఇది ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వస్తుందని అన్నారు. ఈ రైతు ప్రదర్శన క్షేత్రానికి ఏన్కూర్, కామేపల్లి, తల్లాడ, ఇల్లెందు, తదితర మండలాల నుండి సుమారు 1000 మంది రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఐరా సీడ్స్ సెల్స్ మేనేజర్ ముత్తినేని నరసింహారావు మాట్లాడుతూ రైతులకు నమ్మకానికి చిరునామాగా ఐరా సీడ్స్ పనిచేస్తుందని అన్నారు. వందలాదిగా తరలివచ్చిన రైతుల నమ్మకానికి నిలబెట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నదాతలకు భోజనం ఏర్పాటు చేశారు. ఉత్తమ రైతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సేల్స్ ఆఫీసర్ శంకర్, పుల్లారావు, రైతులు పాల్గొన్నారు.

Read More తెలంగాణ ఉద్యమ కారుల మహిళా వేదిక శిక్షణ తరగతుల కరపత్రాల ఆవిష్కరణ

Tags: