ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి.

WhatsApp Image 2024-07-08 at 4.39.39 PM


విశ్వంభర కూకట్ పల్లి ప్రతినిధి జూలై 8 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కూకట్ పల్లి, కే.పి.హెచ్.బి కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్ లో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, వైయస్సార్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్, పాల్గొని వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Read More సీఎం ని కలిసిన ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం